అలుముకున్న తిమిరాన్ని తరిమికొట్టి బ్రతుకు లోగిలిలో ప్రగతి దీపికలు పూయించగలది వృత్తి.
చేస్తున్న పని అల్పమా, అధికమా అన్నది మనమెప్పుడు ప్రాముఖ్యంగా భావించం వృత్తిపర ఆత్మ సంతృప్తే కోరుకుంటామన్నది విధితమే.భుక్తి చేకూర్చే వృత్తి పట్ల అపార గౌరవాన్ని చాటుతూ కార్యక్రమాన్ని సాధారణ పరిస్థితి వున్నప్పుడు చిత్రీకరణ చేశామని తెలియపరుస్తూ స్వాగతం.. నమస్కారం. నాపేరు లోక్ నాధ్.
తమ తండ్రి గారు చేపడుతున్న వృత్తి వైపు వెళ్లాలన్న ఆలోచన, స్వయం ఉపాధి కల్పన చేసుకోవాలన్న కాంక్ష.ఆహార రంగాన రాణించాలన్న ఆశయం రవి కుమార్ గారు మిశ్రమాల బండి ఏర్పాటు కై నిర్ణయంచబడింది.
పూణే లోని ప్రముఖ సాంకేతిక సంస్థ లో మానవ వనరులు అనగా సాఫ్ట్వేర్ కంపెనీ లోని హెచ్. ఆర్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన రవికుమార్ గారు.
మిశ్రమాల మసాలా తయారీ లో శ్రేష్ఠులైన తమ నాన్న గారు లవ కుమార్ గారి వద్ద అవగాహన పొంది తదుపరి బెంగుళూరులోని అల్పాహారాల తయారీ బోధనా విద్యాసంస్థ లో చేరి నైపుణ్యం పొందారు.అనంతరం ఒంగోలులో తమ అమ్మ గారి పేరిట అన్నపూర్ణ మిక్చర్ మసాలా పేరిట బండి ప్రారంభించారు.
తయారీ సందర్బానే వారు అందించు ఉపాహారాల నాణ్యతా పరిధి తెలుస్తుంది. ఆయా మిశ్రమాలు సహజ సిద్ధంగా ఉంటాయి.వాస్తవిక తాజా రుచి పదార్థాలలో ఒదిగి ఉంటుంది. ఇక ఇక్కడ లభించే పెరుగు బజ్జిలు. మిళితం చేసిన అనేక ముడి పదార్థాల సోబగులతో కమ్మగా ఉంటాయి.కాలానికి అనుగుణంగా లభించే పండుతో తయారు చేసే హల్వా తో మధురానుభూతి మనకు లభిస్తుంది.
బండి నిర్వహణ తో వృత్తి పర ఆత్మ సంతృప్తి లభించిందని ఈ రంగాన చాలా సంతోషంగా ఉన్నానని రవికుమార్ గారు అన్నారు .భవిష్యత్ లో ఆహార రంగాన మరింత గా రాణించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని తెలిపి త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు తెలియజేసారు.
చిరునామా:-
అన్నపూర్ణ మిక్చర్ మసాలా,కొండయ్య బంకు రోడ్,రంగారాయుడు చెరువు వద్ద, గాంధీ పార్క్ సమీపాన, లాయర్ పేట ఒంగోలు.
0 Comments